కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: మందకృష్ణ మాదిగ
పరిగి పట్టణ కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి సన్నాహక సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ సెప్టెంబర్ 3వ తేదీన జరిగే మహాగర్జనను విజయవంతం చేయాలని అదే విధంగా ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను వికలాంగులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చి వికలాంగుల హక్కులను సాధించుకుందామని సెప్టెంబర్ 3వ తేదీన జరిగే మహాగర్జనను విజయవంతం చేయాల్సిందిగా వికలాంగుల సన్నాహక సమావేశంలో ఇవాళ పరిగి నియోజకవర్గ స్థాయిలో పిలుపునిచ్చారు అట్టి కార్యక్రమంలో వివిధ వికలాంగుల సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, చేయూత పింఛన్ దారులు, ఒంటరి మహిళా దారులు, వితంతువులు, వృద్ధప్య పింఛన్ దారులు తదితరులు పాల్గొన్నారు
