ఢిల్లీ, ఇతర కీలక నగరాల్లో AI నిఘా, ఎర్రకోట వేడుకలకు 20,000 మంది భద్రతా
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా భద్రత గణనీయంగా పెంచారు. పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేయడం, వాహనాలు, వ్యక్తుల కదలికల్ని చెక్‌పోస్టులు, మెరుగైన ఏఐ నిఘాతో డేగకన్ను వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో, సరిహద్దు పాయింట్లు, వ్యూహాత్మక ప్రదేశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG), మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇతర ఏజెన్సీలతో కూడిన బహుళ-స్థాయి ప్రణాళికతో దేశ రాజధాని భద్రతను బలోపేతం చేశారు.