బీజేపీ రాష్ట్ర కమిటీపై కసరత్తు క్లైమాక్స్
నేడో రేపో కమిటీ ఏర్పాటు కానుంది. జాతీయ నాయకత్వం పిలుపుమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు గురువారం మధ్యాహ్నం ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లారు. కమిటీ సభ్యులపై ఆయన ఇప్పటికే రాష్ట్ర పార్టీ ముఖ్యులు, సీనియర్ నాయకులతో పలు దఫాలుగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పర్యటన సందర్భంగా జాబితాకు ఆయన పార్టీ అధినాయకత్వంతో ఆమోద ముద్ర వేయించుకోనున్నారని పేర్కొన్నాయి.
