డ్రైవర్లు, కండక్టర్లను గౌరవించాలి: సీఎం

అమరావతి : ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను గౌరవించాలని సీఎం చంద్రబాబు మహిళలకు సూచించారు. ‘మహిళలు ఓపిగ్గా ఉండాలి. డ్రైవర్లు, కండక్టర్లను గౌరవిస్తేనే ప్రయాణం సజావుగా సాగుతుంది. ఏం చేసినా వెనక్కి లాగేందుకు చాలా మంది చూస్తున్నారు. అమరావతి శ్మశానం అన్నారు. ఎడారి అన్నారు. కానీ దాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నాం. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం’ అని ఉచిత ప్రయాణ ప్రారంభోత్సవంలో సీఎం తెలిపారు.

బీజేపీ రాష్ట్ర కమిటీపై కసరత్తు క్లైమాక్స్‌

నేడో రేపో కమిటీ ఏర్పాటు కానుంది. జాతీయ నాయకత్వం పిలుపుమేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు గురువారం మధ్యాహ్నం ఆగమేఘాలపై ఢిల్లీ వెళ్లారు. కమిటీ సభ్యులపై ఆయన ఇప్పటికే రాష్ట్ర పార్టీ ముఖ్యులు, సీనియర్‌ నాయకులతో పలు దఫాలుగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పర్యటన సందర్భంగా జాబితాకు ఆయన పార్టీ అధినాయకత్వంతో ఆమోద ముద్ర వేయించుకోనున్నారని పేర్కొన్నాయి.

ఢిల్లీ, ఇతర కీలక నగరాల్లో AI నిఘా, ఎర్రకోట వేడుకలకు 20,000 మంది భద్రతా

 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా భద్రత గణనీయంగా పెంచారు. పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేయడం, వాహనాలు, వ్యక్తుల కదలికల్ని చెక్‌పోస్టులు, మెరుగైన ఏఐ నిఘాతో డేగకన్ను వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో, సరిహద్దు పాయింట్లు, వ్యూహాత్మక ప్రదేశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG), మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇతర ఏజెన్సీలతో కూడిన బహుళ-స్థాయి ప్రణాళికతో దేశ రాజధాని భద్రతను బలోపేతం చేశారు.

జగన్ అడ్డాలో వైసీపీకి షాక్..

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. రెండు చోట్ల వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. పులివెందులలో ఏకంగా డిపాజిట్ కోల్పోయింది. పులివెందుల టీడీపీ చరిత్ర సృష్టించింది.

పింక్‌ బుక్‌ని రెడీ చేసుకుంటున్న బీఆర్ఎస్?

14 ఏళ్ల ఉద్యమం.. పదేళ్ల అధికారం..ఎవరి మీద కక్ష సాధింపు లేదు. ఇబ్బంది పెట్టిన అధికారులను టార్గెట్‌ చేసిన దాఖలాలు అసలే లేవు. అంతా ప్రాసెస్‌లో భాగమని చూసీ చూడనట్లు వదిలేశామ్‌. కానీ ఈసారి కథ వేరేగా ఉంటుందంటోంది బీఆర్ఎస్. పింక్‌ బుక్ రెడీ చేస్తున్నామంటోంది. అతి చేస్తున్న అధికారులు..రెచ్చిపోతున్న కాంగ్రెస్‌ నేతల పేర్లన్నీ రాసిపెట్టి.. లెక్కలు సరిచేస్తామంటోంది. పవర్‌లోకి వచ్చాక హిసాబ్..కితాబ్‌ సెటిల్‌ చేసే బాధ్యత తనదంటూ క్యాడర్‌కు భరోసా ఇస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ […]

  • 1
  • 2