ఢిల్లీ, ఇతర కీలక నగరాల్లో AI నిఘా, ఎర్రకోట వేడుకలకు 20,000 మంది భద్రతా

 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా భద్రత గణనీయంగా పెంచారు. పెట్రోలింగ్‌ను తీవ్రతరం చేయడం, వాహనాలు, వ్యక్తుల కదలికల్ని చెక్‌పోస్టులు, మెరుగైన ఏఐ నిఘాతో డేగకన్ను వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో, సరిహద్దు పాయింట్లు, వ్యూహాత్మక ప్రదేశాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG), మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇతర ఏజెన్సీలతో కూడిన బహుళ-స్థాయి ప్రణాళికతో దేశ రాజధాని భద్రతను బలోపేతం చేశారు.

జగన్ అడ్డాలో వైసీపీకి షాక్..

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. రెండు చోట్ల వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. పులివెందులలో ఏకంగా డిపాజిట్ కోల్పోయింది. పులివెందుల టీడీపీ చరిత్ర సృష్టించింది.

పింక్‌ బుక్‌ని రెడీ చేసుకుంటున్న బీఆర్ఎస్?

14 ఏళ్ల ఉద్యమం.. పదేళ్ల అధికారం..ఎవరి మీద కక్ష సాధింపు లేదు. ఇబ్బంది పెట్టిన అధికారులను టార్గెట్‌ చేసిన దాఖలాలు అసలే లేవు. అంతా ప్రాసెస్‌లో భాగమని చూసీ చూడనట్లు వదిలేశామ్‌. కానీ ఈసారి కథ వేరేగా ఉంటుందంటోంది బీఆర్ఎస్. పింక్‌ బుక్ రెడీ చేస్తున్నామంటోంది. అతి చేస్తున్న అధికారులు..రెచ్చిపోతున్న కాంగ్రెస్‌ నేతల పేర్లన్నీ రాసిపెట్టి.. లెక్కలు సరిచేస్తామంటోంది. పవర్‌లోకి వచ్చాక హిసాబ్..కితాబ్‌ సెటిల్‌ చేసే బాధ్యత తనదంటూ క్యాడర్‌కు భరోసా ఇస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ […]

  • 1
  • 2