పింక్ బుక్‌ని రెడీ చేసుకుంటున్న బీఆర్ఎస్?
14 ఏళ్ల ఉద్యమం.. పదేళ్ల అధికారం..ఎవరి మీద కక్ష సాధింపు లేదు. ఇబ్బంది పెట్టిన అధికారులను టార్గెట్ చేసిన దాఖలాలు అసలే లేవు. అంతా ప్రాసెస్‌లో భాగమని చూసీ చూడనట్లు వదిలేశామ్. కానీ ఈసారి కథ వేరేగా ఉంటుందంటోంది బీఆర్ఎస్. పింక్ బుక్ రెడీ చేస్తున్నామంటోంది. అతి చేస్తున్న అధికారులు..రెచ్చిపోతున్న కాంగ్రెస్ నేతల పేర్లన్నీ రాసిపెట్టి.. లెక్కలు సరిచేస్తామంటోంది. పవర్‌లోకి వచ్చాక హిసాబ్..కితాబ్ సెటిల్ చేసే బాధ్యత తనదంటూ క్యాడర్‌కు భరోసా ఇస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.