భారీ నుండి అతి భారీ వర్షం పడే అవకాశం : వరహావరణ శాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక గోదావరి ప్రాజెక్టులకు స్వల్పంగానే వరద ఉధృతి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో శని, ఆదివారాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
