#ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల వెళ్తున్న భక్తులకు బిగ్ అప్డేట్

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుల నేపథ్యం లో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండాయి. శ్రీవారి సర్వ దర్శన టోకెన్ల కోసం భూదేవి కాంప్లెస్ వద్ద భక్తులు బారులు తీరారు. దీంతో, పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు అమలు చేస్తోంది. దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల కొండ అంతా భక్తులతో నిండిపోయింది. వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి గోగర్భం డ్యామ్ వరకు క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 77,043 భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు నిండిపోవడంతో భక్తులను ఆక్టోపస్ భవనం నుంచి క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *