#క్రీడా వార్తలు

ఈడీ వలలో టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది. ఆయనను విచారణకు పిలిపించింది. ఈ ఆదేశాల మేరకు కొద్దిసేపటి కిందటే లెజెండరీ బ్యాటర్.. దేశ రాజధానిలో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. గతంలో 1xBet అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు సురేష్ రైనా. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. పలు అడ్వర్టయిజ్మెంట్లల్లో నటించారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్ ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీటిపై విచారణకూ ఆదేశించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *