చిరంజీవి బర్త్ డే రోజు బిగ్గ్ అప్ డేట్స్
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22 అంటే ఫ్యాన్స్ అందరికి పండగే. అసలే ఈసారి చిరు 70వ పుట్టినరోజు. దీంతో ఫ్యాన్స్ మరింత స్పెషల్ గా సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. విశ్వంభర సినిమా నుంచి ఆగస్టు 22న టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం. గతంలో గ్లింప్స్ రిలీజ్ చేసి VFX విషయంలో విమర్శలు ఎదుర్కొంది ఈ సినిమా. ఇప్పుడు ఆ విమర్శలన్నిటికి సమాధానం చెప్పేలా అదిరిపోయే టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 17న రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమా టైటిల్ ని ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజున అనౌన్స్ చేస్తామని ఇటీవల అనిల్ రావిపూడి ఓ ఈవెంట్లో తెలిపారు. దీంతో ఈ సారి చిరు పుట్టిన రోజు రెండు సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి మరింత పండగలా మారనుంది. ఇక సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే…….