పాకిస్థాన్ ఉగ్రవాదులు నగరంలోకి

ముంబైలో 34 వాహనాల్లో “మానవ బాంబులు” అమర్చామని, కోటి మందిని చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్‌కు వచ్చిన మెసేజ్‌ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ మెసేజ్‌ పంపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడికి 50 ఏళ్లు ఉంటాయని, అతడిని నోయిడాలో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. మరొకరిని కూడా అరెస్ట్ చేశామని, అతను తన సిమ్ కార్డ్‌ను నిందితుడికి ఇచ్చాడని వివరించారు

DNS న్యూస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం : DNS న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్

DNS సిద్దిపేట : ఈరోజు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామం లో DNS న్యూస్ తెలుగు ఛానల్ వారు మేనేజింగ్ డైరెక్టర్ ముస్త్యాల దామోదర్, పోతుగంటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ గారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో చెవి ముక్కు గొంతు వరిబీజము బీజకట్టు గడ్డ కణతులు థైరాయిడ్ గర్భసంచికి సంబంధించిన సమస్యలు కుటుంబ నియంత్రణ […]

సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదని తేల్చి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటాం అని అన్నారు

చిరంజీవి బర్త్ డే రోజు బిగ్గ్ అప్ డేట్స్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22 అంటే ఫ్యాన్స్ అందరికి పండగే. అసలే ఈసారి చిరు 70వ పుట్టినరోజు. దీంతో ఫ్యాన్స్ మరింత స్పెషల్ గా సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. విశ్వంభర సినిమా నుంచి ఆగస్టు 22న టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం. గతంలో గ్లింప్స్ రిలీజ్ చేసి VFX విషయంలో విమర్శలు ఎదుర్కొంది ఈ సినిమా. ఇప్పుడు ఆ విమర్శలన్నిటికి సమాధానం చెప్పేలా అదిరిపోయే టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు ఈ సినిమాని […]

పార్లమెంట్లో రచ్చ..

లోక్‌సభలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకర సవరణ బిల్లు, యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర సర్కారు ప్రవేశపెట్టింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: మందకృష్ణ మాదిగ

పరిగి పట్టణ కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి సన్నాహక సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ సెప్టెంబర్ 3వ తేదీన జరిగే మహాగర్జనను విజయవంతం చేయాలని అదే విధంగా ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను వికలాంగులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చి వికలాంగుల హక్కులను సాధించుకుందామని సెప్టెంబర్ 3వ తేదీన జరిగే మహాగర్జనను విజయవంతం చేయాల్సిందిగా వికలాంగుల సన్నాహక సమావేశంలో ఇవాళ పరిగి నియోజకవర్గ స్థాయిలో పిలుపునిచ్చారు అట్టి […]

ఈడీ వలలో టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది. ఆయనను విచారణకు పిలిపించింది. ఈ ఆదేశాల మేరకు కొద్దిసేపటి కిందటే లెజెండరీ బ్యాటర్.. దేశ రాజధానిలో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. గతంలో 1xBet అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు సురేష్ రైనా. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. పలు అడ్వర్టయిజ్మెంట్లల్లో నటించారు. ఈ మధ్య […]

తిరుమల వెళ్తున్న భక్తులకు బిగ్ అప్డేట్

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుల నేపథ్యం లో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండాయి. శ్రీవారి సర్వ దర్శన టోకెన్ల కోసం భూదేవి కాంప్లెస్ వద్ద భక్తులు బారులు తీరారు. దీంతో, పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు అమలు చేస్తోంది. దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల కొండ అంతా భక్తులతో నిండిపోయింది. వరుస సెలవుల […]

పాక్ తో మరోసారి జతకట్టిన టర్కీ

ఆగస్టు 14న పాకిస్థాన్ 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. ఈ మేరకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఆర్మీ పరేడ్ జరిగింది. ఈ పరేడ్ లో పాకిస్థాన్ సైనికులతో పాటు టర్కీ, అజర్ బైజాన్ దేశాల సైనికులు సైతం పాల్గొన్నారు. కవాతు నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతిదాడిగా భారత్ పై పాకిస్థాన్ వందల కొద్దీ డ్రోన్ లు, మిసైల్స్ తో విధ్వంసానికి పాల్పడింది.

ట్రంప్ పుతిన్ భేటీ : ఉక్రెయిన్ వార్ పై..

ప్రపంచం మొత్తం ట్రంప్ పుతిన్ భేటీపై ఆసక్తిగా ఎదురుచూసింది . అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ పైన ప్రపంచవ్యాప్తంగా అందరి ఆసక్తి కొనసాగింది. రెండున్నర గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత వీరికి కీలక భేటీ ముగిసింది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎటువంటి ఒప్పందం జరగకుండానే వీరిద్దరి భేటీ ముగిసింది.

  • 1
  • 2