డ్రైవర్లు, కండక్టర్లను గౌరవించాలి: సీఎం

అమరావతి : ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను గౌరవించాలని సీఎం చంద్రబాబు మహిళలకు సూచించారు. ‘మహిళలు ఓపిగ్గా ఉండాలి. డ్రైవర్లు, కండక్టర్లను గౌరవిస్తేనే ప్రయాణం సజావుగా సాగుతుంది. ఏం చేసినా వెనక్కి లాగేందుకు చాలా మంది చూస్తున్నారు. అమరావతి శ్మశానం అన్నారు. ఎడారి అన్నారు. కానీ దాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నాం. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం’ అని ఉచిత ప్రయాణ ప్రారంభోత్సవంలో సీఎం తెలిపారు.

జగన్ అడ్డాలో వైసీపీకి షాక్..

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. రెండు చోట్ల వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. పులివెందులలో ఏకంగా డిపాజిట్ కోల్పోయింది. పులివెందుల టీడీపీ చరిత్ర సృష్టించింది.